రెండో ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకున్న కాంగ్రెస్..
Published on: Wed Dec 30, 2015 10:40AM

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 193 కోట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు మహబూబ్ నగర్ రెండో స్థానాన్ని కూడా కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డి దక్కించుకున్నారు. మొత్తానికి 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొదటనే ఆరు స్ఠానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా.. ఈరోజు మిగిలిన ఆరు స్థానాలకు గాను ఫలితాలు వెలువడిన నేపథ్యంలో నల్గొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్ఠానాలు కాంగ్రెస్, ఖమ్మం టీఆర్ఎస్, రంగారెడ్డిలో కూడా మరో రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.


