ఎమ్మెల్యేగారికి ఆ విషయం తెలియదట..!

 

వాహనాలకు నల్లరంగు ఫిల్మ్‌ను ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఎప్పుడో ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ ఆదేశం ఇచ్చి దాదాపు మూడేళ్లు అయిపోయింది. అప్పటి నుండి దాదాపు వీటిని వాడటం మానేశారు. కానీ ఇన్నేళ్లు అయినా సుప్రీంకోర్టు ఇచ్చిన సందేశం మాత్రం ఓ ఎమ్మెల్యే గారికి ఇంత వరకూ తెలియదంటా..? ఇంతకి ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా..?  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య. అసలుసంగతేంటంటే.. ఎమ్మెల్యే గారు ఈరోజు ఉదయం తన కారు లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. నానక్‌రామ్ గూడ వద్ద కారుకు నల్లరంగు ఫిల్మ్‌ను గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపి రూ. 500 జరిమానా విధించారు. అందుకుగాను స్పందించిన ఆయన ‘‘బ్లాక్ ఫిల్మ్ తీయాలని నాకు తెల్వదు సార్.. ఏదో ఎండకు చల్లగా ఉంది కదా అని ఉంచుకున్నా. అయినా నేను ఎమ్మెల్యేని’’ అని మండిపడ్డారు. మరి మూడేళ్లు అయినా ఎమ్మెల్యేగారికి ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.