TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుబాయ్ లో చిక్కుకుపోయిన తెలంగాణ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు

Published on: Mon Mar 2, 2026 11:47AM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా గల్ప్ దేశాల విమానాశ్రయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దీంతో  తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన వారిలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు.  

తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో  ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన  చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.

 దీంతో తుమ్మల కుటుంబ సభ్యులు దుబాయ్ లో చిక్కుకుపోయారు. దుబాయ్ విమానాశ్రయంలో విమానరాకపోకలను పునరుద్ధరించే వరకూ ఆయన ఇండియాకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.  తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ లో చిక్కుకుపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.