మోడీ సర్కారుపై కేటీఆర్ మాటల దాడి
Published on: Wed Aug 13, 2014 3:26PM
.jpg)
కేంద్రంతో సంబంధాల విషయంలో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెగేదాకా లాగే ధోరణి అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విషయాలలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణాత్మక ధోరణిని ప్రదర్శిస్తూ వస్తోంది. కేంద్రంతో నువ్వా.. నేనా అన్నట్టు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గతంలో అధికారంలో వున్న యుపీఏ ప్రభుత్వం చేసిన తప్పులనే చేస్తోందని, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఎన్డీయే ప్రభుత్వం అని కాకుండా ‘యుపిఎ-3’ ప్రభుత్వం అని పేరు పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కి అధికారాలు కల్పించే విషయంలో సోనియా తప్పు చేసిందని, ఆ తప్పును సరిదిద్దాల్సిన మోడీ కూడా అదే తప్పు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సర్వే మీద కూడా కేటీఆర్ స్పందించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు మిగతావాళ్ళకి ఇచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.


