TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి.. అరగంట పాటు టెన్షన్!

Published on: Fri Nov 6, 2020 6:37PM

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. 30 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. దీంతో ఆయన భద్రతా సిబ్బందితో పాటు అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట సేపు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆయనను సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు లిఫ్ట్ లాక్ తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

 

మంత్రి కొప్పుల ఈశ్వర్ సైఫాబాద్ లోని సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లో బుడగ జంగాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్టులో కిందికి వస్తుండగా అది సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది.తిరిగి రీస్టార్ట్ చేసినా పైకి, కిందికీ తిరిగిందే తప్ప ఆ లిఫ్టు గ్రిల్స్ తెరుచుకోలేదు. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లోని లిఫ్టు చాలా పాతది కావడం, మంత్రిపాటు అనేకమంది ఎక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయినట్టు భావిస్తున్నారు.