TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి శ్రీధర్ బాబు దంపతుల డీప్ ఫేక్ ఫొటోలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

Published on: Tue Jun 30, 2026 1:14PM

తెలంగాణ ఐటీ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ దంపతుల డీప్ ఫేక్ ఫొటోపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులను టార్గెట్ చేస్తూ..  వారిపై  ఏఐ  డీప్ ఫేక్ తో క్రియేట్ చేసిన అభ్యంతరకర మార్ఫింగ్ వీడియోలు  సోషల్ మీడియాలో పోస్టయ్యాయి.  

మంత్రి శ్రీధర్ బాబు దంపతుల వ్యక్తిగత, వృత్తిపరమైన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఇవి ..   హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాది శశిభూషణ్ ఫిర్యాదు చేశారు. సమాజంలో  ఉన్నతమైన హోదాల్లో ఉన్న   మంత్రి,  ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ ఆయన తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తులను గుర్తించి ఐటీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.