కేసీఆర్ నిర్ణయం: 1956 ముందు నుంచి వుంటేనే స్థానికులు

 

ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో కేసీఆర్ తన పట్టుదలను సడలించుకోలేదు. 1956 సంవత్సరం ముందు నుంచి పూర్వికులు తెలంగాణలో వుంటేనే వారిని తెలంగాణ విద్యార్థులుగా గుర్తిస్తామని కేసీఆర్ మంత్రివర్గం సమావేశం తర్వాత ప్రకటించారు. విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) అమలుకు స్థానికతతోపాటు ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 1956కు ముందు తెలంగాణలో నివాసం కలిగి ఉన్న వారికే దీన్ని వర్తింపచేస్తామని, ఆయన వెల్లడించారు.