నిజాం నవాబుకి థాంక్స్: నాయిని
Published on: Wed Sep 17, 2014 10:24AM

నిజాం నవాబు థాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి దినోత్సవం సందర్భంగా తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్పై బుధవారం నాడు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత దేశాన్ని వదులుకుని హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసిన నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలపాలని నాయిని అన్నారు.


