తెలంగాణ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా?

 

kiran kumar reddy, congress telangana, telangana congress

 

 

తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఏర్పాటుకి ఆయన పూర్తి వ్యతిరేకం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచిస్తే ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.


కిరణ్ కుమార్ రెడ్డి తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 175 మంది శాసనసభ్యుల్లో 170 మంది సభ్యులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం శాసనసభ్యులు కూడా రాజీనామాకు ముందుకు రావచ్చునని అంటున్నారు.


తెలంగాణపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతను సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెట్టినట్లు సమాచారం. దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. తనను తాను నాయకుడిగా నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.