ఓయూలో కుదరదు..నాగోల్‌లో పెట్టుకోండి

తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో రైల్వే గ్రౌండ్‌లో సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చునని న్యాయస్థానం తెలిపింది. అయితే తమకు ఓయూ గ్రౌండ్సే కావాలని టీజేఏసీ తేల్చిచెప్పింది...తాము సభ నిర్వహించేది తెలంగాణ మొత్తానికి తెలియాలని అలాంటిది నగరానికి విసిరివేసినట్లు ఉండే శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీజేఏసీ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఓయూలో టీజేఏసీ నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించండతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.