రేపే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

 

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. గురువారం సాయంత్రం 5గంటలకు ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను  ప్రకటించనున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు.