‘సర్వే’పై నేడు హైకోర్టు విచారణ
Published on: Thu Aug 14, 2014 6:43AM

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ సర్వే గణాంకాల సేకరణ చట్టానికి విరుద్ధంగా వుందని, దీనిని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ కేసు బుధవారం నాడే కోర్టు ముందుకు వచ్చింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది సర్వేకి సంబంధించి ఇంకా సవరణలు వున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించబోయే సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు, సవరణలతో గురువారం నాడు కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేస్తూ, హైకోర్టు కేసును వాయిదా వేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ విలాస్ పుర్కర్ విచారణ చేస్తున్నారు.


