TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కానిస్టేబుల్ ఈశ్వరయ్యకి నాయిని నివాళి

Published on: Sat Aug 2, 2014 12:01PM

 

హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో నకిలీనోట్లు చెలామణీ చేసే ముఠా జరిపిన కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ శంకరయ్య భౌతిక కాయాన్ని హోంమంత్రి సందర్శించి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ వెంకటరెడ్డిని కూడా నాయిని పరామర్శించారు.