Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్
posted on: Nov 15, 2025 11:58AM

గేమింగ్ యాప్ లు, బెట్టింగ్ యాప్ లపై కొరడా ఝుళిపిస్తున్న కోర్టులకూ హ్యాకింగ్ బెడద తప్పడం లేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు ఆ వెబ్ సైట్ లో ఏకంగా బెట్టింగ్ యాప్ ను తీసుకువచ్చారు. వివరాల్లోకి వెడితే.. తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని శనివారం గుర్తించారు.
]కోర్టు ఆర్డర్లు డౌన్ లోడ్ చేస్తుండగా హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందన్న విషయం వెలుగు చూసింది. సదరు వెబ్ సైట్ లో బెట్టింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. హైకోర్టు వెబ్ సైట్ లోకి హ్యాకర్లు ఏలా యాక్సెస్ అయ్యారు.. సర్వర్ లో లోపాలు తదితర విషయాలపై విచారణ చేపట్టారు. మరో వైపు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సిస్టమ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది


.webp)



