TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా? 

Published on: Tue Sep 7, 2021 2:22PM

వినాయక చవితి వేడుకలు, నిమజ్జనోత్సవంపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అంటూ  జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక కూడా లేదా అని ధర్మాసనం ఆగ్రహించింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.నిమజ్జనం సందర్భంగా జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని హైకోర్టు కామెంట్ చేసింది.  

విచారణలో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. జీహెచ్ఎంసీ పరధిలోని 48 చెరువులు, కొలనుల్లోనూ  వినాయక నిమజ్జనం  ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని తెలిపింది. అయితే సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్న తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వెల్లడించింది. 
వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది