TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గిరిజా ప్రియద‌ర్శిని క‌న్నుమూత‌

Published on: Sun May 4, 2025 5:07PM

 

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని  కన్నుమూశారు.కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతి పట్ల హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ పట్టణానికి చెందిన గిరిజా ప్రియదర్శిని.. 1995లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. విశాఖ జిల్లా కోర్టులో ఏడేండ్లు ప్రాక్టీస్‌ చేశారు. 

2008లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జిగా చేశారు. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జిగా చేశారు. హైకోర్టు జ‌డ్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే కంటే ముందు.. గిరిజా ప్రియద‌ర్శిని.. రాష్ట్ర లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీగా ప‌ని చేశారు.