TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ సర్కార్ ఘన స్వాగతం

Published on: Fri Jun 11, 2021 8:36PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు అపూర్వ స్వాగతం లభించింది. రాజ్‌భవన్‌ చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యాక హైదరాబాద్ కు ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన రాక కోసం తెలంగాణ  సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జస్టిస్‌  ఎన్వీ రమణ 3 రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఉండనున్నారు.

అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సీజేఐ నేరుగా  రాజ్‌భవన్ వెళ్లారు.