TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ బార్డర్ లో చెక్ పోస్టులు.. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ

Published on: Sun Jan 9, 2022 11:32AM

దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రికార్ట్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం దేశ వ్యాప్తంగా లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా వస్తుండటమే కాకుండా ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కొవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. తమ రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాయి. 

కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హస్సెల్లి గ్రామంలో  పాటు జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.  సరిహద్దు దాటుతున్న వ్యక్తులకు స్క్రీన్ టెస్టులు నిర్వహిస్తున్నారు.  ఈ చెక్‌పోస్టుల వ‌ద్ద 24 గంట‌ల పాటు పోలీసులు అందుబాటులో ఉండ‌నున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్నవారికి స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న గణేష్‌పూర్ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే ప్రయాణికుల‌కు కొవిడ్ ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ స్థాయి అధికారితో పాటు పోలీసులు వైద్యాధికారి వైద్య సిబ్బంది ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశాలతో .. నెగిటివ్ రిపోర్టు వ‌స్తేనే రాష్ట్రంలోకి వారిని అనుమ‌తిస్తున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బీదర్‌లో  కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లా అధికారులు మీర్జాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది.