అమరుల కుటుంబాలకు అండగా కేసీఆర్ సర్కార్

 

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. పుల్వామాలో జరిగిన దాడి అమానుషం, హేయమైనదని కేసీఆర్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ఆయన సంతాపం తెలిపారు. ఇది మన దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ చర్యను తెలంగాణ అసెంబ్లీ ఖండిస్తోందంటూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.