TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలి: గవర్నర్ తమిళిసై

Published on: Mon Jun 8, 2020 2:33PM

తెలంగాణలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆమె ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు చేస్తున్నప్పటికీ మరిన్ని పరీక్షలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు.

కరోనా బారిన వైద్యులు మరియు సిబ్బందిని ఆమె స్వయంగా వెళ్లి పరామర్శిచారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆమె అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ ను విఐపిలకు అలాగే వైద్యులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఇక్కడ ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నిమ్స్ లోని నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది వైద్యులు, 8 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్న ఇతర వైద్యులు మరియు స్టాఫ్ ను క్వారంటైన్ లో ఉంచారు.