Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం?
posted on: Sep 3, 2025 2:31PM

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశం తేలనందున రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని కోరుతూ తెలంగాణ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం గవర్నర్ కు పంపామనీ, ఆయన వద్ద ఆ బిల్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉందనీ రేవంత్ సర్కార్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నది. నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తూండటంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయింది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనుందున మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయి, స్థానిక సంస్థలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనప్పటికీ.. రిజర్వేషన్ల వివాదం కారణంగా ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోతున్నది.


.webp)



