పీవీకి భారతరత్న.. టీ సర్కార్ ప్రతిపాదన
Published on: Mon Sep 15, 2014 3:43PM

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మవిభూషణ్, ఆచార్య జి.రామిరెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డులకు సిఫారసు చేసి ప్రతిపాదనలు పంపనుంది. అలాగే పద్మశ్రీ అవార్డులకు జి.నర్సింగరావు, కాపు రాజయ్య పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపనున్నారు.


