Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నటుడు ఫిష్ వెంకట్ కు తెలంగాణ సర్కార్ చేయూత
posted on: Jul 10, 2025 7:05AM

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను బుధవారం (జూన్ 9) మంత్రి శ్రీహరి పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడమే కాకుండా..తక్షణ ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించారు.
రెండు కిడ్నీలూ పూర్తిగా దెబ్బ తినడంతో ఇన్నాళ్లూ డయాలసిస్‌తో నెట్టుకొచ్చిన వెంకట్ పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయక తప్పని పరిస్థతి ఏర్పడింది. చికిత్స చేయించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పుడు వెంకట్ కుటుంబ సభ్యులు కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నారు.



.webp)


