తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ జీతాల పెంపు
Published on: Mon Feb 27, 2017 3:23PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన చంద్రులు ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వోద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచారు. తాజాగా మరోసారి జీతాలు పెంచుతామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అది కూడా అందరికి కాదు అంగన్వాడీ సిబ్బందికి..ఇవాళ జనహిత కార్యక్రమంలో భాగంగా ప్రగతిభవన్లో సీఎం అంగన్వాడీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన త్వరలోనే మీకు మరోసారి జీతాలు పెంచుతానని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10,500 సహాయ సిబ్బందికి రూ.6 వేలు చోప్పున వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని..వారికి తిన్నంత ఆహారం పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


