TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదివారం పెట్రోలు బంకుల మూత అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Published on: Fri May 15, 2026 5:48PM

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది.  ఆదివారం  పెట్రోల్ బంకులు మూతపడతాంటూ వస్తున్న వార్తలతో జనంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.  పెట్రోల్ కోసం శనివారమే లైన్లలో నిలబడాలా? అనే సందేహాలు సామాన్యులను  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న  మెసేజ్‌లు వాహనదారులలో ఆందోళనను రేకెత్తించాయి.  ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూతపడతున్నాయన్న ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులలో ఆందోళన నింపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దనీ, వారంలో ఏడు రోజులూ పెట్రోలు బంకులు తెరిచే ఉంటాయనీ తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. 

చమురు కంపెనీల డీలర్లతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది.    తెలంగాణలో ఇంధన సరఫరా వ్యవస్థ సురక్షితంగా,  నిరంతరాయంగా కొనసాగుతుందని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని  తెలంగాణ సర్కార్ స్పష్టంగా ప్రకటించింది.