Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
posted on: Jul 3, 2025 4:39PM

అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు అంగన్వాడీ సహాయకుల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ఠ వయసు 45 ఏళ్లుగా ఉండేది.
తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనను సవరించి, వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచింది. ఈ మార్పునకు సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పని చేస్తున్న 4,322 మంది అంగన్వాడీ సహాయకులకు ప్రయోజనం కల్గునుంది. కాగా ఇటీవల అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.






