ఈ నెల 21 నుంచి దసరా సెలవులు
Published on: Mon Sep 8, 2025 3:08PM

తెలంగాణలో ఈ నెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ సెలవులు అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు దాదాపు 13 రోజుల పాటు పండగ సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది.
మరోవైపు జూనియర్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఈ సెలవులు అక్టోబర్ 5వ తేదీతో ముగుస్తాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


