గన్‌పార్క్ వద్ద సీఎం కేసీఆర్ కారుని అడ్డుకున్న నిరుద్యోగి

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం, ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.

కాగా, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌ కారును ఓ నిరుద్యోగి అడ్డుకున్నారు. సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.