భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి...
Published on: Fri Mar 2, 2018 11:49AM

తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ లోని భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్ వద్ద పోలీసులకు మావోలకు మధ్య కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు చెబుతున్నారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ పై విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు స్పందించి... ఇదో బూటకపు ఎన్ కౌంటర్ అని..మావోయిస్టులను పట్టుకొని వచ్చి తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దులో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆయన అన్నారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


