తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ
Published on: Tue Nov 14, 2023 4:00PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4798 మంది అభ్యర్థులు 5716 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలనలో 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల జమున నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా 7 నియోజకవర్గాల్లో బిఎస్ పి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా.. తదనంతర ఘట్టం కూడా పర్తయ్యింది. అదేనండీ.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన పూర్తవగా.. నెల 15వ తేదీ వరకు నామినేషణ్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారు.. ఎవరు తప్పుకున్నారు అనే అంశంపై, అభ్యర్థుల వివరాలపై క్లారిటీ వస్తుంది.


