తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు!
Published on: Mon Sep 30, 2024 6:54PM

తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 1న 11062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి సరికొత్త రికార్డు సృష్టించింది. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 13న రాష్ట్ర విద్యాశాఖ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. సెప్టెంబర్ 6న ఫైనల్ కీ విడుదలైంది. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఈ పరీక్షల్లో భర్తీ చేస్తారు.


