ఓటు వేసిన కేసీఆర్
Published on: Sat Sep 13, 2014 3:16PM
.jpg)
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తన స్వగ్రామం అయిన చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగినప్పుడల్లా కేసీఆర్ తన స్వగ్రామానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీ. ఈసారి కూడా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి చింతమడక వెళ్లి ఓటు వేశారు. కేసీఆర్ మెదక్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.


