TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

1 నుంచి రేవంత్ జిల్లాల పర్యటన

Published on: Thu Nov 20, 2025 1:32PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టనున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తిరుగులేని విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆ ఉత్సాహం అలా ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని పార్టీ ఖాతాలో జమ చేయాలని రేవంత్ తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలోనూ తొలుత పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఆ పంచాయతీ ఎన్నికల ముహూర్తం కూడా దాదాపుగా ఖారారైనట్లే కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన అంశం న్యాయస్థానాలలో వచ్చిన తీర్పుల కారణంగా వీలు కాలేకపోయినప్పటికీ, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ కు క్రెడిట్ అయితే దక్కిందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 1 నుంచి 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించి, అవి పూర్తి అవ్వగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అదే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేపట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ నెల 1 నుంచి 9 వరకూ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అయితే అంతకు ముందే.. రాష్ట్రంలో వివిధ శాఖల వారీగా జరిగిన ప్రగతిపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.