కాబోయే సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్ ప్రకటన
Published on: Sun Dec 3, 2023 11:40AM
తెలంగాణలో కాంగ్రెస్ విజయసారథి రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్ల నుంచి మద్దతు లభిస్తోంది. తొలుత రేవంత్ ను వ్యతిరేకించిన సీనియర్ మోస్ట్ లీడర్ వీహను మంతరావు తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించి సంచలనం సృష్టించారు. సాధారణంగా కాంగ్రెస్ లో పదవుల కోసం పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ వీహచ్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత దిశగా ఉరకలు వేస్తున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత వీహచ్.. కాబోయే సీఎం రేవంత్ రెడ్డే అని ప్రకటించారు.


