TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

Published on: Fri Jul 4, 2025 11:06AM

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకు ముందు గురువారం (జులై 3) హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే  కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఖర్గేకు స్వాగతం పలికిన వారిలో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

అదలా ఉంచితే  గాంధీ భవన్ లో జరిగే పీఏసీ భేటీలో మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశమౌతారు. అంతే కాకుండా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఖర్గేతో భేటీ అయ్యారు.  ఇక   స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై పార్టీ కీలక నేతలతో ఖర్గే చర్చిస్తారు.