మేనిఫెస్టో అంటే భగవద్గీత: కేసీఆర్ ఉవాచ!
Published on: Thu Jul 17, 2014 7:45PM
.jpg)
ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తూ భగవద్గీతతో పోల్చారు. అంత పవిత్రమైనది కాబట్టే తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీ ఒకటి ఎప్పుడూ తన టేబుల్ సొరుగులో ఉంటుందని ఆయన తెలిపారు. పవిత్రమైన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తామని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో రూపకల్పనకు ఎన్నో రోజులు శ్రమించామని, మేధావులు కూడా పలు సూచనలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.


