అలా ప్రారంభోత్సవం.. ఇలా యాక్సిడెంట్...
Published on: Thu Aug 14, 2014 4:10PM

హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌శాఖకు 300 బైక్‌లు, 100 ఇన్నోవాలను పోలీసు శాఖకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ వాహనాల ప్రారంభోత్సవం గురువారం ఉదయం ట్యాంక్ బండ్ మీద జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖకు ఈ వాహనాలు అందించారు. అయితే కేసీఆర్ అలా వాహనాలు అందించారో లేదో ఇలా యాక్సిడెంట్ జరిగింది. ప్రారంభోత్సవం అయిన తర్వాత రెండు ఇన్నోవా వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అది కూడా ఎక్కడో కాకుండా ట్యాంక్ బండ్ మీదే కావడం విచిత్రం. శుభమా అని ప్రారంభోత్సవం కాగానే వాహనాలకు యాక్సిడెంట్ కావడం అశుభసూచకం అనిపించినప్పటికీ, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అందరూ లైట్‌గా తీసుకున్నారు.


