తెలంగాణలో పేకాట క్లబ్‌లు ఉండకూడదు: కేసీఆర్
Published on: Thu Aug 14, 2014 3:36PM
.jpg)
తెలంగాణలో పేకాట క్లబ్ అనే మాటే వినపడకుండా తమ ప్రభుత్వం చేస్తుందని, ఈ విషయంలో పోలీసులు కూడా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖకు మూడు వందల బైక్‌లు వంద ఇన్నోవా వాహనాలను కేసీఆర్ హైదరాబాద్‌లోని టాంక్ బండ్ మీద జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ భద్రత విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనలను తెలిపారు.
1. హైదరాబాద్ నగరం అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాం. అవి మూడు నెలలో పనిచేయడం ప్రారంభిస్తాయి.
2. అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తాం.
3. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. 4. హైదరాబాద్‌లో పేకాట
క్లబ్ అనే మాటే వినపడకుండా చేస్తాం.
5. పోలీసులు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలి.


