పీయూష్ గోయల్‌తో కేసీఆర్ భేటీ
Published on: Sat Sep 6, 2014 3:06PM
.jpg)
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య గురించి కేసీఆర్ ఆయనతో చర్చించారు. రెండు రోజుల క్రితం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొన్ని కామెంట్లు చేశారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా వున్నారని, తెలంగాణ విద్యుత్ సమస్య గురించి తమని ఏమీ అడగటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్, కేసీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.


