కేసీఆర్ నా తండ్రితో సమానం: రాజయ్య
Published on: Thu Sep 11, 2014 4:29PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తండ్రితో సమానమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్‌లో కేసీఆర్ తనతో మాట్లాడిన తీరు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఒకవేళ నేను ఏమైనా పొరపాట్లు చేస్తే నన్ను మందలించడానికి ఆయనకు సర్వాధికారాలు వున్నాయి. హడావిడి ప్రకటనలు చేయవద్దని ఆయన నాకు చెప్పడం ఎంతమాత్రం తప్పుకాదు. ఒక తండ్రిలాగా ఆయన నాకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరంగల్‌లో కేసీఆర్ మాట్లాడిన తీరును కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ దళిత పక్షపాతి. నాకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షే’’ అని రాజయ్య అన్నారు.


