TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్‌నే బురిడీ కొట్టించారు

Published on: Tue Apr 5, 2016 2:56PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..సమకాలీన రాజకీయాల్లో వ్యూహాలు పన్నడంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి మేధావినే కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. దిక్కులేని పేదలకు ఆపదలో ఆపన్న హాస్తం అందిస్తుంది ముఖ్యమంత్రి సహాయనిధి. రోజూ ఎంతో మంది పేదలు తమను ఆదుకోవాల్సిందిగా సీఎం కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకుంటారు, లేదా స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుంటారు. వాటిని పరిశీలించి సీఎం, తన సహాయక నిధి నుంచి నిధులు విడుదల చేస్తారు.

 

అయితే  తప్పుడు దరఖాస్తులు, నకిలీ ధ్రువపత్రాలతో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన నిధుల్ని పక్కదారి పట్టించారు అక్రమార్కులు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో నిగ్గుతేలే నిజాలు బయటకు వచ్చాయి. నకిలీ బిల్లుల ద్వారా 73,68,572 లక్షల నగదును మధ్యవర్తులు స్వాహా చేసినట్టు గుర్తించారు.రాష్ట్రంలోని 50 ఆస్పత్రుల్లో 112 మంది చికిత్స పొందుతున్నట్టు దళారులు నకిలీ బిల్లులు సృష్టించినట్టు సీఐడీ అధికారులు బట్టబయలు చేశారు. దీంతో ఖంగు తినడం సీఎం కార్యాలయం వంతైంది.