టీ-సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిర్భావం

 

రాష్ట్ర విభజన కంటే ముందుగానే తెలుగు సినీపరిశ్రమ రెండుగా చీలిపోయింది. తెలంగాణా నిర్మాతలు, సినిమా పంపిణీదారులు, ప్రదర్శకులు మరియు స్టూడియో యజమానులు కలిసి కొద్ది నెలల క్రితం పెట్టుకొన్న దరఖాస్తుని రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ హైదరాబాద్ ఆమోదించడంతో ‘తెలంగాణా సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్’ (రిజిస్టర్డ్ నంబర్: 602, ఆగస్ట్ 21,2013) ఆవిర్భవించింది. దీనిపై తెలంగాణా సినీ దర్శకులు, నిర్మాతలు తదితర సంఘాల వారు హర్షం వ్యక్తం చేసారు.

 

టీ-చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యుల పేర్లు: అధ్యక్షుడు: యాన్. శంకర్; ఉపాధ్యక్షుడు: సంగిశెట్టి దశరద్; ప్రధాన కార్యదర్శి: సయ్యద్ రఫీ; జాయింట్ సెక్రెటరి: ఆకుల సురేష్; కోశాధికారి: సాయి వెంకట్.

టీ-సినిమా నిర్మాతల కౌన్సిల్ అధ్యక్షుడు: సాన యాదిరెడ్డి

టీ-సినీ పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు: ఉదయ రెడ్డి

టీ- సినిమా ప్రదర్శకుల సంఘం అధ్యక్షుడు: వీ.యల్. మల్లికార్జున్ గౌడ్

 

టీ-సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిర్భావం గురించి తెలియజేస్తూ ఒక లేఖను మంత్రి డీకే అరుణ కుమారికి వారు సమర్పించి దానికి ప్రభుత్వ గుర్తింపు కల్పించవలసిందిగా వారు కోరారు. ఆమె వారిని ఈ సందర్భంగా అభినందించి లేఖను సంబంధిత అధికారులకు వెంటనే పంపారు.