తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు సారథ్యం ఎపి కేడర్ అధికారిణి
Published on: Thu May 18, 2023 4:22PM
తెలంగాణా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కమిటీకి తెలంగాణ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతకుమారి సారథ్యం వహించనున్నారు. సోమేష్ కుమార్ తర్వాత మన రాష్ట్రానికి ఎవరు ప్రధాన కార్యదర్శి అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారుల జాబితా తెప్పించుకుని మీడియా పుంఖాను పుంఖలుగా వార్తలు రాసింది. శాంతకుమారి పేరును ఎవరూ ఊహించలేదు. దీనికి కారణం కూడా లేక పోలేదు. ఆమెకు మచిలీ పట్నం మూలాలు ఉండటంతో ఎవరూ ఊహించి వార్తలు రాయలేదు. బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత బిఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ వోటర్లను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సడెన్ గా శాంతకుమారి పేరును అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణా కమిటీకి శాంతకుమారి సారథ్యం వహించనున్నారు. శాంతకుమారి కెసిఆర్ కు నమ్మిన బంటు అనే పేరు ఉంది. జూన్ 2 నుంచి వరుసగా 21 రోజుల పాటు జరగనున్న వేడుకలు ఈమె కనుసన్నల్లోనే జరగనున్నాయి. అర్వింద్ కుమార్, దేశ పతి , ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులకు ఈ కమిటీలో చోటు దక్కింది


