నేడు టీ క్యాబినెట్ మీటింగ్..
Published on: Sat Jan 2, 2016 9:46AM

నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకూ సుదీర్ఘ సమావేశం జరగనున్నట్టు తెలస్తోంది. ఈ సందర్బంగా మంత్రి మండలి గ్రేటర్ అభివృద్దిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీలోని నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులు రద్దు.. భవనాలు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణపై మంత్రిమండలి చర్చించనుంది. అంతేకాదు గోదావరిపై పలు బ్యారేజీల నిర్మాణానికి అధికార పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.


