TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు

Published on: Thu Mar 6, 2025 10:03AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం (మార్చి 6) జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో   ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.  అలాగే ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు తీర్మానించనుంది.  

అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, అలాగే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.  ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు, అలాగే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీలను కూడా ఈ భేటీలోనే ఖరారు చేసే అవకాశాలుున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా నూతన టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.   వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.