త్వరలో కేసీఆర్ క్యాబినెట్ లోకి ఆ ముఖ్య నేత

 

 

గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మంత్రులుగా  కొంత మందికే అవకాశం ఇచ్చి తరువాత జరిగే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేల పని తీరుని బట్టి మంత్రి వర్గ విస్తరణ లో మరి కొంత మందికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐతే ఎన్నికల హడావిడి ముగిసినా ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ ఉస్ లేదు. తాజాగా ఆగస్టు 15  నాటికీ మంత్రివర్గ విస్తరణ చేసి పూర్తి స్థాయిలో పరిపాలన చేపట్టబోతున్నట్లు సీఎం కెసిఆర్ పార్టీ లోని ముఖులతో అన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పరిధి లోని ఒక వర్గం ఓట్ల కోసం ఖమ్మం జిల్లా నుండి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు కానీ లేదా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు కానీ స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఐతే ఎమ్మెల్యే అజయ్ కు సీనియర్ నేతల తో సన్నిహిత సంబంధాలు లేకపోవటం, అలాగే తుమ్మలకు  అందరిని కలుపుకు పోయే గుణం ఉండటంతో పాటు సీఎం కు అత్యంత సన్నిహితుడు కావటంతో  కెసిఆర్ తుమ్మల వైపే  మొగ్గుతున్నారని ముందుగా ఆయనను మంత్రిని చేసి ఆ తరువాత ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విస్తరణ లో భాగంగా మహేశ్వరం నుండి గెలిచిన సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కి కూడా చోటు దక్కనున్నట్లు సమాచారం.