TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ బడ్జెట్ వివరాలు...

Published on: Mon Mar 13, 2017 12:37PM


తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా... ఈటల రాజేందర్ 2017-18గాను తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి ఈయన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇయితే తొలిసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఇంకా ఆయన బడ్జెట్ లోని అంశాలు..

* రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు
* ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
* నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
* రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు


* శాంతి భద్రతలకు రూ.4,828 కోట్లు
* సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు
* మిషన్ బగీరథకు రూ. 3 వేల కోట్లు
* పరిశ్రమలకు రూ. 985 కోట్లు
* హరితహారానికి రూ.50 కోట్లు
* రహదారుల అభివృద్ధికి రూ.5,033 కోట్లు
* జీహెచ్ఎంసీకి రూ.1000 కోట్లు
* జర్నలిస్టులకు రూ.30 కోట్లు
* ఈ ఏడదితో రుణమాఫీ పూర్తవుతుంది. వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.46, 946 కోట్లు

* బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
* ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు
* ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు
* బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు