TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. ఎవ‌రికి ఎంతంటే...

Published on: Mon Mar 7, 2022 12:12PM

2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింద‌ని అన్నారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామన్నారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్‌ బేరర్‌ అని చెప్పారు. ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహపరుస్తోందని ఆరోపించారు. ఆసరా, రైతు బంధులాంటి ఏ పథకమైనా లబ్ధిదారులకే చేరుతుందని అన్నారు హ‌రీశ్‌రావు. 

బ‌డ్జెట్ హైలైట్స్ ఇవే....

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లు
దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థికసాయం
నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు కేటాయింపు
ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు
ఎక్సైజ్‌ ఆదాయం రూ.17,500 కోట్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.15,600 కోట్లు

గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు
పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లు
కొత్త మెడికల్‌ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు
అటవీ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
హరితహారానికి రూ.932 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ. 12 వేల కోట్లు
రోడ్లు భవనాల శాఖకి రూ.1542 కోట్లు, పర్యాటక రంగానికి 1500 కోట్లు
తెలంగాణ పోలీస్ శాఖకి రూ. 9315 కోట్లు 
ఇరిగేషన్‌ శాఖకు రూ. 22675 కోట్లు, అసరాకు రూ.11728 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.2750 కోట్లు
గిరిజన సంక్షేమానికి రూ.12,565 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ. 5698 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 117 కోట్లు 
మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు,  నారాయణపేట, గద్వాల్‌,యాదాద్రిలో మెడికల్‌ కాలేజీలు
రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ

రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం
నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు
రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు
యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు
బస్తీ దవాఖాలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది
కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు
ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు, వరంగల్‌లో హెల్త్‌ సిటీ
అవయవమార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌
ఆక్సిజన్‌ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంచాం
వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం నుంచి 29 శాతానికి పెరిగింది
పన్ను ఆదాయం రూ.1,08,212 కోట్లు, కేంద్ర పనుల్లో వాటా రూ.18,394 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.25,421 కోట్లు, గ్రాంట్లు రూ.41,001 కోట్లు
రుణాలు రూ.25,970 కోట్లు, అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు

2021-22 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,54,860 కోట్లు
2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువ
2015-16 నంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి
ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామి
తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.1 శాతంగా అంచనా
దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా అంచనా
తెలంగాణలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.18,500 కోట్లు ఖర్చుచేశాం
నమ్మక్క- సారక్క బ్యారేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది