TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలవరం ముంపుపై తెలంగాణ తొండి వాదన..పిపిఎ సమావేశం బాయ్ కాట్

Published on: Thu Nov 17, 2022 9:52AM

ఏపీకి జీవనాడి వంటి పోలవరం విషయంలో తెలంగాణ అభ్యంతరాలతో బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ముఖ్యంగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపు ముప్పు ఉందని తెలంగాణ, అసలు ముప్పే లేదని ఏపీ అధికారుల వాదనతో సమావేశం హీటెక్కింది. ఇరు రాష్ట్రాల అధికారులు తమతమ వాదనలకే కట్టుబడి ఉండటంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.  

 ముంపు ముప్పుపై చర్చకోసం తెలంగాణ పట్టుబట్టింది అలాగే వరద నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాల డిమాండ్ చేసింది. దీనికి ప్రతిగా ఏపీ  పోలవరంలో 150 అడుగుల ఎత్తులో నీటినిల్వ ఉన్నప్పుడు బ్యాక్‌వాటర్‌ ప్రభావం తెలంగాణపై ఇసుమంతైనా ఉండదని తేల్చి చెప్పింది.   పదే పదే ముంపుపై చర్చెందుకని నిలదీసింది. అలాగే ముంపు  అంశాన్ని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖకు నివేదించినప్పుడు ఇప్పుడీ సమావేశంలో చర్చ అనవసరమని పోలవరం ప్రాజెక్టు అధారిటీ చైర్మన్ పేర్కొన్నారు.

  అయితే అందుకు ససేమిరా అన్న పోలవరం ప్రాజెక్టు వల్ల కిన్నెరసాని, ముర్రేడువాగుల ప్రవాహంపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఎన్జీటీలో దాఖలైన కేసులో ఆర్నెల్లలోపు ముంపు ముప్పుపై సర్వే చేపట్టాలని ఆదేశాలున్నాయనీ పట్టుబట్టింది.  అయితే తెలంగాణ వాదనను పోలవరం ప్రాజెక్టు అధారిటీ తిరస్కరించింది. దీంతో తెలంగాణ అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.