TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ బీజేపీ నేత మాధవీలతకు స్వర్ణం

Published on: Wed Jul 1, 2026 10:02AM

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ నేత  మాధవీలత తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించారు.   2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన  మాధవీలత..  ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు. హైదరాబాద్‌  గచ్చిబౌలి శాట్స్  షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాధవీలత   25 మీటర్ల పిస్టల్ మాస్టర్స్ ఉమెన్ విభాగంలో  స్వర్ణ పతకం సాధించారు.  ఈ పోటీల్లో మొత్తం 300 పాయింట్లకు గాను ఏకంగా 245 పాయింట్లు సాధించి  పసిడి పతకం కైవశం చేసుకున్నారు. 

 షూటింగ్ పై తనకు చిన్నతనం నుంచీ మక్కువ ఉందని ఈ సందర్భంగా మాధవీలత చెప్పారు.  ఎన్‌సీసీ  కేడెట్‌గా ఉన్న రోజుల్లో, రిపబ్లిక్ డే శిక్షణ తరగతుల్లో భాగంగా తాను మొదటిసారి రైఫిల్ ప్రాక్టీస్ చేశానని, అప్పటి నుంచీ షూటింగ్ క్రీడపై ఆసక్తి పెరిగిందన్నారు.